బాబుకు భారీగా ముడుపులు

()ప్రజలను మోసం చేసేందుకు బాబు డ్రామాలు
()రెండు నాల్కల ధోరణి..ప్రజల జీవితాలతో చెలగాటం
()పొల్యూషన్ లేనప్పుడు పైపులైన్ దేనికి బాబు..?
()ఆక్వాఫుడ్ బాధితులతో వైయస్ జగన్ ముఖాముఖి
()ప్రభుత్వ తీరుపై మండిపాటు

పశ్చిమగోదావరి)) ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ ఆక్వాఫుడ్ బాధితులకు అండగా నిలిచారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం, యాజామాన్యం అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లాలోని భేతపూడికి చేరుకొన్న సందర్భంగా జననేతకు ప్రజలు, పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా వైయస్ జగన్ బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు, మత్స్యకారుల పోరాటానికి బాసటగా నిలిచి వారికి ధైర్యం చెప్పారు.  ప్రాజెక్ట్ వల్ల కలిగే అనర్థాల గురించి స్వయంగా వారికే మైక్ ఇచ్చి ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేశారు. 

బాధితులతో ముఖాముఖి

వైయస్ జగన్
ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టం గురించి మీకే మైక్ ఇస్తాను. బాబుకు మెసేజ్ చేయండని వైయస్ జగన్ బాధితులకు మైక్ ఇచ్చారు. 

ఐరావతి అవ్వ(జిరాయిపాలెం)
కంపెనీ దాటుతానే మా ఊరు. ప్రాజెక్ట్ ను ఇక్కడ నుంచి తీసేయాలి. ఫ్యాక్టరీ వస్తే పంటలు పండవు, మాకున్న ఒకే ఒక కాలువ గొంతేరు కలుషితమవుతుంది. కంపెనీ వల్ల కాలువలోకి కల్మషాన్ని వదిలేస్తారని భయం. చేపల చెరువులుండవు. ఏమీ బతకవు. మాకు కంపెనీ వద్దే వద్దే. 

వైయస్ జగన్
మోసపూరితంగా భూములు కొనుగోలు చేశారు. చేపల చెరువుకోసమని కొన్నారు. మన పంచాయతీలన్నీ ప్రాజెక్ట్ వద్దని తీర్మానం చేశారా. నష్టపోయే ప్రాంతం ఎన్ని ఎకరాలుంటుంది.

వీరవెంకట సత్యవాణి(బేతపూడి గ్రామం)
మాది ఎకరంన్నర పొలం అమ్మాను. కొనేటప్పుడు ఆక్వా చెరువుల కోసమని చెప్పి కొన్నారు. ఫ్యాక్టరీ కోసమని చెప్పలేదు. మా సంతకాలు ఫోర్జరీ చేసుకొన్నారు. రెండున్నరేళ్లుగా పోరాడుతున్నాం. మా మూడు గ్రామాలు పోరాడుతుంటే మరో 50 గ్రామాలు కలిసివచ్చాయి. ఫ్యాక్టరీ వద్దని ఏకగ్రీవ తీర్మానం చేసి కలెక్టర్ కు ఇస్తే మా అభిప్రాయాలు తీసుకోలేదు. కలెక్టర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇద్దరు బడాబాబుల కోసం పనిచేస్తున్నామని మాకు చెప్పలేదు. సొంతూరు వదిలి ఎక్కడకు వెళ్లాలి. బాబు ఎవరబ్బ సొమ్మని మా భూముల్లోంచి పైపులైన్ వేస్తాడు. ప్రాజెక్ట్ కడితే పంటలు పండకపోతే వరిని సింగపూర్ నుంచి తెస్తాడా..?

వైయస్ జగన్
చెక్ పవర్ రద్దు చేస్తామని తీర్మానం వెనక్కి తీసుకునేలని భయపెడుతూ కలెక్టర్ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయడం దారుణం. నేనిక్కడకు వచ్చినప్పుడు అనేకమందిని అడిగా. రైతుల భూముల్లోంచి పైపులైన్ వేస్తే అది లీకేజ్ ఐతే పరిస్థితి ఏంటి. సముద్రతీరానికి ఫ్యాక్టరీ తరలిస్తే అందరికీ మేలు. గ్రామాల మధ్య నుంచి ఫ్యాక్టరీని తరలించాలి.

సత్యనారాయణ(తుందుర్రు టీడీపీ ఎంపీటీసీ)
ప్రాజెక్ట్ కట్టడానికి వీళ్లేదు. అధికారపార్టీని ఎదిరించి ప్రజల వెంట నిలిచాం. ప్రజల వెనకాలే ఉంటాం. తమను టీడీపీ నాయకులు వెనక్కి తగ్గాలని ఒత్తిడి తెచ్చారు.  అందరి రాజకీయ నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. సీపీఎం, వైయస్సార్సీపీ నాయకులు మాకు అండగా నిలిచారు. జగన్ గారి దగ్గరకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వైయస్సార్సీపీ నాయకులు మాకు హామీ ఇచ్చారు. మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వం  జగన్ గారు. మా దగ్గరకు వస్తానని మాట ఇచ్చారు. వచ్చారు. బాధిత గ్రామాల తరపున పాదాభివందనం తెలుపుతున్నా.

వైయస్ జగన్
బాబు వైఖరికి టీడీపీ నాయకులు కూడా నిరసన తెలుపుతున్నారు. ప్రైవేటు కంపెనీ అని తెలిసి కూడా దాచిపెట్టి ప్రభుత్వ సంస్థ అని ప్రజలను తప్పుదోవ పట్టించి ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేశారు. ప్రాజెక్ట్ నియామాలను వ్యతిరేకించిన వారిమీద హత్యాయత్నం కేసులు పెట్టింది వాస్తమేనా..?

సత్యనారాయణ
బైండోవర్ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టారు. రెండున్నరేళ్లుగా పోరాడుతున్నా, పేపర్లో వస్తున్నా, ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం, యాజమాన్యానికి పట్టడం లేదు

వైయస్ జగన్
ప్రాజెక్ట్ ను వ్యతిరేకించిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గం. సెంట్రల్ జైల్లో సత్యవతిని , ఇక్కడ బాధితులను కలిశాక  వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 

కీర్తన
నా భర్త మహేష్. ఫ్యాక్టరీ వద్దన్నందుకు నా భర్తను తీసుకుపోయారు. 40 రోజులైంది.  జైల్లో పెట్టారు. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా భయపడుతూ ఉంటున్నాం. పిల్లలతో సహా తీసుకెళ్తామని బెదిరిస్తున్నారు. మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు. ఇంకెక్కడైనా పెట్టుకోవాలి

వైయస్ జగన్
ప్రాజెక్ట్ ను వ్యతిరేకించినందుకు ఏడుగురిపై హత్యాయత్నం కింద బెయిల్ ఇవ్వకుండా సతాయిస్తున్నారు. వీరు గాక ఇంకా కొంతమందని హత్యాయత్నం కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.  ప్రాజెక్ట్ వల్ల పొల్యూషన్ వస్తుందని, ఉన్న కాల్వ నాశనమయ్యే పరిస్థితి వస్తుందని, వాసనతో బతకలేని పరిస్థితి వస్తుందని చెబుతుంటే...40 రోజులుగా హత్యాయత్నం కింద జైల్లో పెడుతున్నారు. 3 వేల టన్నుల రొయ్యలు, చేపలను కెమికల్స్ తో శుద్ధి చేసినప్పుడు పొల్యూషన్ కాకుండా ఎలా పోతాయని బాబును అడుగుతున్నా. పొల్యూషన్ తో ముడిపడి ఉన్న పరిశ్రమ అని తెలిసి కూడా సెంట్రల్ యాక్ట్ లు సీ ఫుడ్ ఫ్యాక్టరీలు పొల్యూషన్ అని చెబుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. బాబు రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతాడు. ప్రాజెక్ట్ జీరో పొల్యూషన్ అని ఓవైపు, పైపులైన్ వేస్తామని మరోవైపు రెండు విధాలా మాట్లాడుతున్నారు. పొల్యూషన్ లేనప్పుడు పైపులైన్ దేనికని అడుగుతున్నా.  పొల్యూషన్ ఉందనిబాబుకు తెలుసు కాబట్టే పైపులైన్ వేస్తానని ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఎన్నికలప్పుడు కూడా ఇదే మాదిరి రైతుల రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రప్పిస్తానని, అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు.  పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ఇంటికో జాబు, నెలకు 2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి మోసం చేశాడు. ఇవాళ పబ్బం గడపడానికి పైప్ లైన్ వేస్తానని మాట్లాడుతున్నాడు. ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ సొమ్ముతో పైపులైన్ ఎందుకు వేస్తున్నావని అడుగుతున్నా . బాబుకు ఏస్థాయిలో ముడుపులు అందుతున్నాయో దీన్ని బట్టే అర్థమమవుతోంది. పని జరిగితే చాలని చెప్పిబాబు ప్రజలను మోసం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నాడని వైయస్ జగన్ మండిపడ్డారు. 


Back to Top