పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకను ఎలా ఆహ్వానిస్తారు?

న్యూఢిల్లీ: పార్టీ  ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను మంగళవారం
జరిగిన  అఖిలపక్ష సమావేశానికి, తమ పార్టీ
తరపున  ఆహ్వానించడం పట్ల వైయస్సార్‌
కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి తీవ్ర అభ్యంతరం
వ్యక్తం చేశారు. వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీలో
ఉన్నప్పుడు బుట్టా రేణుక పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా వ్యవహరించేవారు.  పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరిన తరువాత ఆమెను
అనర్హురాలిగా ప్రకటించాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు  పలు దఫాలు లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు
ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యాన్ని విస్మరిస్తూ పార్లమెంట్‌
వర్షాకాల సమావేశాల సందర్భంగా  ఏర్పాటు చేసిన అఖిలపక్ష
సమావేశానికి డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హోదాలో బుట్టా రేణుకకు ఆహ్వానం పంపించడాన్ని
తీవ్రంగా పరిగణించిన రాజ్యసభ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి ఇదే అంశాన్ని అఖిలపక్ష సమావేశంలో
ప్రస్తావిస్తూ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top