పోలవరానికి అన్నీ గండాలే

పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం అవ్వటం పట్ల వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఇది కేంద్రం ఆధీనంలో ఉందా, రాష్ట్రం ఆధీనంలో ఉందా అన్న అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. విజయ వాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 నాటికి కూడా పోలవరం ప్రాజక్టు పూర్తి అవుతుంది అనే నమ్మకం కలగటంలేదని ఆయన పెదవి విరిచారు. పట్టిసీమ వల్ల రాష్ట్రానికి గానీ రైతులకు గానీ ఏమాత్రం ప్రయోజనం లేదని ఆయన అన్నారు.  రెండు మూడు లిఫ్టులు పెట్టి నీళ్ళు తోడటం వల్ల నదులు అనుసంధానం అవ్వదని ఆయన తేల్చిచెప్పారు. 
Back to Top