ఎన్ని ఇళ్లు నిర్మించారో శ్వేతపత్రం విడుదల చేయాలి

గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు మూడున్నరేళ్ల పరిపాలన కాలంలో ఎన్ని లక్షల ఇల్లు కట్టించారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు. 2015 ఏప్రిల్‌ 14వ తేదీన ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీమ్‌ పేరుతో ఇళ్లకు ఫౌండేషన్‌ వేసిన చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు నిర్మాణం కూడా పూర్తి చేయలేదన్నారు. గుంటూరు జిల్లాలో 18,250 ఇళ్లు కట్టిస్తానని చెప్పిన చంద్రబాబు వాటిలో ఎన్ని పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గాంధీ జయంతి నాడు కూడా తన అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నాడని  మండిపడ్డారు. తన పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు అమాయక ప్రజలును మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు.  

తాజా ఫోటోలు

Back to Top