ఎన్ని కోట్లకు అమ్ముకున్నావ్ బాబు

విజయనగరంః  మూడురోజుల పాటు నిర్వ‌హించిన మ‌హానాడులో ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఒక్క తీర్మానం కూడా చంద్రబాబు చేయ‌లేద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. రాజ‌ధాని నిర్మాణాన్ని వైయ‌స్ జ‌గ‌న్ అడ్డుకుంటున్నార‌నడం హాస్య‌ాస్ప‌దంగా ఉంద‌ని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు తేవ‌డం చేత‌గాకనే చంద్రబాబు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 

ఓటుకు నోటు కేసు,  అవినీతికి  పాల్పడడం వల్లే  బాబు కేంద్ర ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిలదీయడం లేదని కోల‌గ‌ట్ల విమ‌ర్శించారు. త‌న అస‌మ‌ర్థత‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికే బాబు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయన ఫైరయ్యారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి ముందు టీడీపీ రాజ్య‌స‌భ సీట్ల‌ను ఎన్ని కోట్ల‌కు అమ్ముకుందో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

Back to Top