రైతులు చనిపోతే కేసీఆర్ కు నం.1 స్థానమా

  • రైతుల‌కు పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలి
  • లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతాం
  • మిష‌న్‌కాక‌తీయ ప‌నులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • టీ వైయస్సార్సీపీ అధికార ప్ర‌తినిధి కొండా రాఘ‌వ‌రెడ్డి
హైదరాబాద్ః  త‌క్ష‌ణ‌మే రైతుల‌కు పూర్తిస్థాయి రుణమాఫీ అమ‌లు చేయాల‌ని తెలంగాణ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి కొండా రాఘ‌వ‌రెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిప‌క్షంలో ప్ర‌తిప‌క్షాలతో క‌లిసి ప్ర‌జాక్షేత్రంలో ఆందోళ‌న‌లు నిర్వ‌హించాల్సి వ‌స్తుంద‌ని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన జిల్లా స‌మీక్ష స‌మావేశం అనంత‌రం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఏమన్నారంటే... 

అయ్యా హ‌రీష్‌రావు... ఏమైంది మిష‌న్‌కాక‌తీయ‌
  • కేసీఆర్ ప్ర‌భుత్వం ఎంతో గొప్ప‌గా చెబుతున్న... హ‌రీష్‌రావు ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న మిష‌న్ కాక‌తీయ ప‌నులు ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా మారాయి.
  • ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే మిష‌న్‌ కాక‌తీయ కింద 560 చెరువులు ఎంపిక చేశారు. రూ. 211 కోట్ల 17ల‌క్ష‌లు కూడా కేటాయించారు.
  • కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు 33 చెరువులు మాత్రమే పూర్తిచేశారు. 
  • అన్ని జిల్లాల్లో ఇదే ప‌రిస్థితి. కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను భ్ర‌మ‌లో పెడుతుంది
  • మిషన్ కాకతీయ పనులు బ్రహ్మాండమంటూ వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టి టీవీ ఛానళ్లు, పేప‌ర్లు, రేడియోలు, ఢిల్లీకి ఇచ్చిన నివేదిక‌ల్లో చెప్ప‌డం సిగ్గుచేటు.
  • మిష‌న్ కాక‌తీయ ప‌నుల్లో భాగంగా మొద‌టి, రెండ‌వ విడ‌త‌లలో ఎన్ని చెరువులు ఎంపిక చేశారు... ఎంతమేర నిధులు కేటాయించారు.. అందులో ఎన్ని చెరువులు పూర్త‌య్యాయో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి.
  • మొద‌టి విడ‌త‌లో 7 వేల చెరువులు, రెండవ విడ‌త‌లో 7 నుంచి 8 వేల చెరువులు ఎంపిక అయ్యాయ‌ని చెబుతున్న ముఖ్య‌మంత్రి, నీటి పారుద‌ల శాఖ మంత్రి హ‌రీష్ రావులు అందులో ఎన్ని చెరువులు పూర్త‌య్యాయో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి.
  • అన్నీ మాటలే..చేతలేవి 
  • రైతు ఏడ్చిన రాజ్యం... ఎద్దు ఏడ్చిన వ్య‌వ‌సాయం బాగుప‌డ‌ద‌ని ప‌దేప‌దే చెప్పే కేసీఆర్‌కు ఇప్పుడా రైతుల బాధ‌లు గుర్తుకు రావ‌డం లేదా..?
  • రైతు రుణమాఫీ కింద మొద‌టి విడ‌త‌గా రూ. 25వేలు, రెండ‌వ విడ‌త కింద రూ. 25వేలు చెల్లించి... మూడ‌వ విడ‌త వ‌చ్చే స‌రికి రూ. 4019 కోట్లు ఇవ్వాల్సి ఉండ‌గా.. అందులో రూ. 2019 కోట్లు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం చేసుకొన్నారు. చివ‌ర‌కు రూ. వెయ్యి కోట్లు మాత్ర‌మే బ్యాంకుల‌కు చెల్లించారు. 
  • ఒక్కో రైతుకు రూ. 25వేల రుణమాఫీ అవుతుంద‌ని ఆశ‌ప‌డితే.. కేవ‌లం రూ. 6,250 వేలు మాత్ర‌మే మాఫీ అయ్యింది.
  • రుణమాఫీ కాక రైతులు ఖ‌రీఫ్ పంట‌కు ముందుకు వెళ్ల‌లేని దుస్థితి.
  • ఖ‌రీఫ్ సీజ‌న్‌లో రైతుల‌కు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాలు రూ. 17,460 కోట్లు
  • బ్యాంకులు రైతుల‌కు చెల్లించిన రుణాలు రూ. 3,761 కోట్లు
  • 30 ల‌క్ష‌ల మంది రైతులకు ఖ‌రీఫ్ రుణాలు ఇవ్వాల్సి ఉండ‌గా... 6 ల‌క్ష‌ల 16వేల మంది రైతుల‌కు మాత్ర‌మే రుణాలు అందాయి.
  • కేసీఆర్ వైఖ‌రి వ‌ల్ల రైతులు పొలాల‌ను వ‌దిలిపెట్టి రోడ్ల‌పై ధ‌ర్నాలు చేయాల్సిన ప‌రిస్థితి దాపురించింది. ఇందుకేనా తెలంగాణ ఏర్పడింది.
  • ఖ‌రీఫ్ సీజ‌న్‌లో రైతుల‌కు ఇవ్వాల్సిన రూ. 17,460 కోట్లు రుణాలను త‌క్ష‌ణ‌మే అందించాలి... లేనిప‌క్షంలో వైయ‌స్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు తప్పవు. 
  • కోటి ప‌ది ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట సాగు అవ్వాల్సి ఉండ‌గా.... 30 ల‌క్ష‌ల ఎక‌రాల్లో కూడా సాగు కావడం లేదు.
  • రాష్ట్రంలో వంద‌లాది మంది రైతులు చ‌నిపోతే కేసీఆర్ కు నంబ‌ర్ 1 స్థానమా..?   గ‌జ్వేల్‌లో 60 మంది రైతులు చ‌నిపోతే నంబ‌ర్ వ‌న్ స్థానమా..?
  • రైతులు రోడ్ల‌పై తిరిగే దుస్థితి నెల‌కొంది... కేసీఆర్ భ్ర‌మ‌లు కేవ‌లం 2019 వ‌ర‌కు మాత్ర‌మే. 
  • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డెమోక్ర‌సీ ఉన్న పార్టీ..
  • వైయ‌స్సార్సీపీని తెలంగాణ‌లో బ‌లోపేతం చేసేందుకు మండ‌ల‌, గ్రామస్థాయి క‌మిటీలు వేసి, ప్ర‌తి జిల్లాలో శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తాం. 
  • ప‌దివేల మందితో రెండు రోజుల పాటు మళ్లీ విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేస్తాం. అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తాం.
  • ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన స‌మీక్షా స‌మావేశాల్లో ఆయా జిల్లాలో ఉన్న పార్టీ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాం. 
అని కొండా రాఘవరెడ్డి తెలిపారు. 

Back to Top