షాపులు తొలగించే అధికారం మీకు ఎవరిచ్చారు..?

పశ్చిమగోదావరిః ఏలూరులో పేదలకు జరిగిన అన్యాయం అత్యంత దారుణమని వైఎస్సార్సీపీ నేత ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా పేదల కడుపు కొట్టడం తానెప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వానికి, మున్సిపల్ కార్పొరేషన్ కు ఏం హక్కు ఉందని షాపులను తొలగిస్తున్నారని ప్రశ్నించారు. మారుమూల వీధిలో చిన్న చిన్న షాపులు పెట్టుకుంటే వాటిని తొలగించడం బాధాకరమన్నారు. 

పేద ప్రజలు వ్యాపారం చేసుకోవడానికి, షాపులు కట్టుకునేందుకు ...మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్టాలిచ్చి బ్యాంక్ లోన్ లిచ్చారు. అలా వారు సొంతదారులయ్యారు. షాపులను కూల్చే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రభుత్వం, అధికారులపై మండిపడ్డారు. షాపులు పగులగొట్టి రోడ్డున పడేసిన వారికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు, వారికి  వేరేచోట స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో బాధితులతో కలిసి ఆందోళన చేపడుతామన్నారు. 
Back to Top