అన్యాయంపై నిలదీస్తే అరెస్ట్ చేస్తారా..?

తిరుపతి: అక్రమ అరెస్టులతో తమను భయపెట్టలేరని  వైయస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి టీడీపీ కుట్రలపై మండిపడ్డారు.  గురువారం తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామంలోని రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నారని ఆరోపిచారు. 

ఎనిమిదేళ్లుగా ఆస్తిపన్ను, కరెంటు బిల్లులు కడుతున్నా... పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేందుకు కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. బాధితుడి పక్షాన వెళ్లినందుకు తనను అరెస్ట్ చేస్తారా ? అంటూ పోలీసులపై చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫైర్ అయ్యారు. 
Back to Top