రెండేళ్లలో సభ నిర్వహణ అధ్వానం.. శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్) చంద్రబాబు రెండేళ్ల పరిపాలనలో శాసనసభ సమావేశాల నిర్వాహణ అధ్వానంగా
సాగిందని వైయస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏడుసార్లలో ఒక్కసమావేశాన్ని కూడా హుందాగా నిర్వర్తించిన పాపాన పోలేదు.
ప్రతిపక్షంపై ఎదురుదాడి తప్ప మంచి చట్టం చేయడంలోగానీ, మంచి సాధించిన పరిస్థితులు కానీ లేవని
శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు . తెలుగుదేశానికి నూరుగురు కౌరవులు ఉన్నారని,
అది చాలక మరికొంతమందిని తెచ్చుకొన్నారని శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు.

 

Back to Top