హోదాపై అట్టుడికిన సభ

హైదరాబాద్ః ఏపీ శాసనసభ అట్టుడుకుతోంది. హోదాపై చర్చకు పట్టుబడుతూ వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభను స్తంభింపజేశారు.  ప్రత్యేకహోదా అంశంపై చర్చ జరపాలని రెండ్రోజులుగా వైయస్సార్సీపీ నినదిస్తున్నా ఏపీ సర్కార్ కు పట్టడం లేదు. హోదాపై చర్చకు చంద్రబాబు భయపడుతున్నారు.  హోదా వద్దు ప్యాకేజీనే ముద్దు అన్న రీతిలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చంద్రబాబు కాలరాస్తున్నారు. ఐదుకోట్ల మంది భవిష్యత్తు అయిన ప్రత్యేకహోదా కోసం ప్రజల పక్షాన గొంతెత్తి నినదిస్తున్న ప్రతిపక్షం గొంతును అధికార టీడీపీ నొక్కే ప్రయత్నం చేస్తోంది.

Back to Top