వైయ‌స్‌ హయాంలో అందరికీ ఇల్లు

విజయవాడ :

 దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌లో పేద‌లంద‌రికీ ప‌క్కా ఇల్లు మంజూరు చేశార‌ని వైయ‌స్‌ఆర్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ బండి నాగేంద్ర పుణ్యశీల అన్నారు. టీడీపీ నేత‌లు దోచుకునేందుకు ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ ప‌థ‌కాన్ని వినియోగించుకుంటున్నారని ఆమె  ధ్వజమెత్తారు.  గురువారం ఆమె విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకం హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ కింద నగరపాలక సంస్థకు 28 వేల ఇల్లు మంజూరు చేసింద‌న్నారు.  తొలి విడతగా మూడు నియోజక వర్గాలకు 12 వేల ఇళ్ళను కేటాయించారన్నారు. మూడు నియోజక వర్గాలకు 9 వేల ఇళ్ళు,  మంత్రి దేవినేని ఉమాకు 3 వేల ఇళ్ళు కేటాయించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు కేటాయించాల్సిన ఇళ్ళను టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్పొరేటర్ల ద్వారా డివిజన్లలో పచ్చచొక్కాల కార్యకర్తలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. నగరంలో ఇళ్ళ కేటాయింపుల్లో మంత్రి దేవినేని ఉమా జోక్యం ఏమిటని ప్రశ్నించారు. మూడేళ్ళ పాలనలో పేద,మధ్య తరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేయడంలో విఫలమైన టీడీపీ ప్రభుత్వం హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ను హౌసింగ్‌ఫర్‌ టీడీపీగా మార్చేయడం సిగ్గుచేటన్నారు. అర్హులైన వారికి ఇళ్ళు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 15న జరగనున్న కౌన్సిల్‌ సమావేశంలో ఇళ్ళ మంజూరులో అవకతవకలపై చర్చిస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి  అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను రాజకీయాలకు అతీతంగా అందిస్తామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచరణలో అమలు చేయడం లేదన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు తీరు మార్చుకోకుంటే ఇళ్ళ కోసం పేదల పక్షాన వైయ‌స్‌ఆర్‌ సీపీ పోరుబాటకు సిద్ధమవుతోందన్నారు. స‌మావేశంలో కార్పొరేటర్‌ షేక్‌బీజాన్‌బీ, అవుతు శ్రీశైలజ, బి.సంధ్యారాణి, టి.జమలపూర్ణమ్మ,చోడిశెట్టి సుజాత పాల్గొన్నారు

తాజా ఫోటోలు

Back to Top