జననేత కోసం వేసవి ఎండను కూడా లెక్కచేయని ప్రజలు

మండుతున్న వేసవి ఎండను కూడా లెక్క చేయకుండా ప్రతిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. త‌మ బాధ‌లు చెప్పుకునేందుకు ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. ఏ ఊరికి వెళ్లినా కోలాహలమే...సందడే. జననేతతో సెల్ఫీలు తీసుకునేందుకు యువత పోటీలు పడుతున్నారు.  ఇంకా అనేక మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు  తండోపతండాలుగా వస్తున్నారు.  ఎండతో పోటీపడుతూ పల్లెలన్నీ జనంతో పోటెత్తుతున్నాయి. దారులన్నీ జనసంద్రంగా మారుతున్నాయి. తమ అభిమాన నేత వైయ‌స్ జగన్‌తో ఆత్మీయంగా మాట్లాడాలని.. ఆయనతో కరచాలనం చేయాలని... కష్టాలను చెప్పుకుని భరోసా పొందాలని ప్రజా సంకల్ప యాత్రకు వెల్లువలా తరలి వస్తున్నారు.

Back to Top