ఆత్మ బంధువు కోసం మండుటెండల్లో..

మే 17వ తేదీ. మండు వేసవి. ఆపై కొత్తగూడెం. భగభగమంటున్న భానుడు.. ఇవేవీ ఆ ప్రాంత ప్రజలకు పట్టలేదు. తమ అభిమాన నేత రాజన్న తనయ శ్రీమతి షర్మిల వస్తోందన్న సంతోషంలో ఉన్నారు. పసిపిల్లలను చంకనవేసుకుని రోడ్లపై నిలబడి ఎదురుచూశారు. ఆమె దగ్గరకు రాగానే హారతులిచ్చి, తమ ఆడబిడ్డకు చీరలు, గాజులు, పూలు పెట్టి ఆశీర్వదించారు. ఊరి పొలిమేర దాటేంతవరకూ ఇలాగే వెంట ఉండి సాగనంపారు. అవ్వలు, తాతలు ఒంట్లోకి సత్తువ కూడదీసుకుని వచ్చి ఆమెకు రెండు చేతులెత్తి ఆశీర్వాదాలు అందించారు. మా అమ్మ కట్టె చేతబుచ్చుకుని రోడ్డుపైకి వచ్చింది. ఆమెను చూడగానే షర్మిల ఆగి ఆమె నుదిటిపై ముద్దుపెట్టింది అంటూ రామవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఆశ్చర్యంగా చెప్పారు. గ్రామస్థులంతా ఇలా వస్తుండడం చూసిన షర్మిల మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని  అనగా మాకోసం ఎండనపడి వచ్చావు. మీ అన్న కూడా ఇలాగే ఇక్కడికి వచ్చాడు. మనది నాన్నగారు కలిపిని అనుబంధం అంటూ ఓ వృద్ధురాలు చెప్పిన మాటలకు షర్మిల ఆనందబాష్పాలు రాల్చారు.
 
మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చేరుకుని మే 11 నాటికి సరిగ్గా పదేళ్ళవుతోంది. శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్ర కూడా అదే రోజు అక్కడికి చేరుకోవడం కాకతాళీయమే. అలాగే మరుసటి రోజునే డాక్టర్ వైయస్‌ఆర్ పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. అదే తీరుగా శ్రీమతి షర్మిల కూడా ఆయన బస చేసిన తాళ్ళమడ సెంటర్లోనే బసచేసి, ప.గో జిల్లాలోకి ప్రవేశించారు. 46 డిగ్రీల వేడిమిలో పాదయాత్ర సాగింది.

కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో శ్రీమతి షర్మిల మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు జగనన్న అండగా నిలబడతాడని భరోసా ఇచ్చారు. ఉద్యోగులందరికీ భద్రత కల్పించడమే కాక, పింఛను సౌకర్యం, వారి పిల్లలకు విద్య, పక్కా ఇళ్ళు కట్టించి అండగా ఉంటారని పేర్కొన్నారు. ఆమె కార్మికులు హెల్మెట్, పార, బుట్ట బహుకరించారు.

తాజా వీడియోలు

Back to Top