హోరెత్తిన వైయస్‌ఆర్‌ సిపి నిరసనలు

హైదరాబాద్, 20 సెప్టెంబర్‌ 2012: పెంచిన డీజిల్ ధర తగ్గించాలని, గ్యా‌స్ సిలిండర్ల‌ సబ్సిడీపై కేంద్రం విధించిన పరిమితిని ఎత్తివేయాలని, చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా తలపెట్టిన బం‌ద్ గురువారం ‌హైదరాబాద్‌లో ప్రశాంతంగా జరిగింది. బంద్‌ సందర్భంగా నగరంలోని అనేకచోట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. బంద్‌కు మద్దతుగా నగరంలోని ప్రధాన కూడళ్ళ వద్ద పార్టీ వాదులు నిర్వహించిన నిరసనలు హోరెత్తాయి. పలుచోట్ల ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.

దోమలగూడ డివిజన్‌లో వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు నకిరే కంటి మహేశ్‌కుమార్, రా‌జ్ మనోహ‌ర్‌, రాంనగర్ డివిజ‌న్‌లో పార్టీ నేతలు వెంకటేశ్‌గౌడ్, కాదాసి రాణి, శ్రావ‌ణ్‌ ఆందోళనల్లో పాల్గొన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ గ్రేటర్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు జి. సాల్మ‌న్‌రాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ప్రధాని, సోనియా, సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆందోళనలో కోళ్ల సుధాకర్, డీకే శ్రీనివా‌స్, కాదాసి రాణి, త్యాగ, హర్ష‌ద్, సంప‌త్, క్రాంతి, గద్దె శ్రీనివా‌స్, బొట్ల మధు‌ తదితరులు పాల్గొన్నారు.

సీతాఫల్‌మండిలో పార్టీ నగర కన్వీనర్‌ ఆదం విజయ్‌ కుమార్‌ ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కన్వీనర్‌ బి.జనార్దన్‌రెడ్డి ఉప్పల్, మల్కాజిగిరిలలో నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ నాయకురాలు పి. విజయారెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద నిరసన ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైయస్‌ఆర్‌ సిపి సేవాదళం రాష్ట్ర కన్వీనర్‌ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి నేతృత్వంలో జూబ్లీహిల్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోశారు.

పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలా కుమారి, ఐటి విభాగం కన్వీనర్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోను, సనత్‌నగర్‌, మలక్‌పేటలలో నగర సేవాదళం, యువజన విభాగం కన్వీనర్లు వెల్లాల రామ్మోహన్‌, లింగాల హరిగౌడ్‌, శేరిలింగంపల్లిలో ముక్కా రూపానందరెడ్డి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌లలో సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి, నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు రవికుమార్‌, రాజేంద్రనగర్‌లో శ్రీనివాసులునాయడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

తాజా వీడియోలు

Back to Top