నిరాశ్రయులను సత్వరమే ఆదుకోవాలి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వర్షాల కారణంగా ఇళ్లు కూలి నిరాశ్రయులైన వారిని సత్వరమే ఆదుకోవాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడచిన రెండు రోజులుగా కురుస్తున వర్షాలకు 13,15 డివిజన్లలోని పలుప్రాంతాల్లో ఇళ్లు, విద్యుత్  స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఎమ్మెల్యే ఆయా డివిజన్లలో పర్యటించారు. 

వర్షాల కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇళ్లు కూలిపోవడంతో తెలిసిన వారి పంచన తలదాచుకుంటున్నామని పలువురు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ  వర్షాల కారణంగా విద్యుత్  స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. నిరాశ్రయులయ్యారని వారికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు పక్కాగృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

To read this article in English:  http://bit.ly/1rY6Gkv 

Back to Top