ప్రజా సంకల్ప యాత్రకు 26న విరామం

 
నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన విరామం ప్రకటించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం తెలిపారు. ఆ రోజున పోలీసులకు పరేడ్‌ ఉండటం, పోలీసు శాఖలో సెలవులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వారి నుంచి వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో ఈ నెల 28వ తేదీన పాదయాత్ర 1000 కిలోమీటర్లు మైలు రాయి చేరనున్న క్రమంలో నిర్వహించ తలపెట్టిన వాక్‌ విత్‌ వైయస్‌ జగన్‌ కార్యక్రమాన్ని 29వ తేదీకి మార్చినట్లు తలశీల రఘురాం పేర్కొన్నారు.
 
Back to Top