హోదాపై ప్రధాని ప్రకటన చేయాల్సిందే..!

హైదరాబాద్ః రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ...ఏపీకి ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.   తాము ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరుతూ గతంలోనే లేఖ రాశామని, ఈ విషయమై బుధవారం కూడా ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించామని తెలిపారు.

అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, ప్రధాని మోదీ మాత్రం ప్రత్యేక హోదాపై ప్రకటన ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. గన్నవరం లేదా తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రధానిని కలిసి ప్రత్యేక హోదాపై వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
Back to Top