తీవ్ర జ్వరంతో భూమన సంఘీభావ యాత్ర

తిరుపతి: ప్రజలు కడతేర్చడం కోసం నిబద్ధతతో మండుటెండలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ 2 వేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు సంఘీభావ పాదయాత్రలు చేస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న భూమన సంఘీభావ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలు తీర్చడానికి వైయస్‌ జగన్‌ తప్ప మరో నాయకుడు లేరని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. చంద్రబాబు చేసిన వంచన మీద.. ప్రజా కంటక పాలన మీద వంచనపై గర్జన కార్యక్రమం ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు చెప్పారు. 
Back to Top