రాత్రంతా ఉత్కంఠ

గుంటూరు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దీక్ష శిబిరంలో రాత్రంతా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సోమవారం సాయంత్రానికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. రాత్రి పొద్దు పోయాక మీడియా సమక్షంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్ సేకరించటంతో పాటు బీపీ చెక్ చేసి, బరువును నమోదు చేసుకొన్నారు. అప్పటికి బీపీ 130/80, పల్స్ రేటు 77, బరువు సుమారు 72 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాల్ని ప్రభుత్వ వైద్యుల ప్రతినిధి మీడియాకు అందించారు. కీటోన్స్ పెరుగుతున్నట్లు గుర్తించామని,  ఇది ప్రమాదకరమని వివరించారు.

సాయంత్ర నుంచీ వైఎస్ జగన్ అలసటతో పడుకొనేందుకు మొగ్గు చూపించారు. సతీమణి భారతి, తల్లి విజయమ్మ అక్కడే ఉండి సపర్యలు చేశారు. రాత్రి బాగా పొద్దు పోయేదాక జగన్ అభిమానుల ప్రవాహం మధ్య గడిపారు. ఈలోగా  బెంగళూరు నుంచి సోదరి షర్మిల అక్కడకు చేరుకొన్నారు. అప్పటికే విశ్రాంతి తీసుకొంటున్న జగన్ ను పలకరించారు. కొద్ది సేపు యోగ క్షేమాలు విచారించారు.

తర్వాత వైఎస్ జగన్ పూర్తిగా విశ్రాంతి తీసుకొన్నారు. ఈలోగా నెమ్మదిగా పోలీసు బలగాలు అక్కడకు చేరుకొన్నాయి. మూకుమ్మడిగా జగన్ విశ్రాంతి తీసుకొనే వైపుకి చొచ్చుకొని వెళ్లారు. అక్కడ నుంచి జగన్  ను ఆసుపత్రి కి తరలించారు. 
Back to Top