హైకోర్టు తీర్పు టీఆర్ఎస్ కు చెంపపెట్టు

హైదరాబాద్ : హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని టీ వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ అన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని శివకుమార్ తెలిపారు.  హైదరాబాద్లో శివకుమార్ మాట్లాడుతూ... పార్టీ ఫిరాయించిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేయాలని స్పీకర్కు శివకుమార్ విజ్ఞప్తి చేశారు.

హైకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువులోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని శివకుమార్ అన్నారు.


Back to Top