టీడీపీ నేతకు చుక్కెదురు

 హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్‌పీ వై రెడ్డికి
ఉమ్మడి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు జిల్లా, ఉడుములపురం వద్ద ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్
లిమిటెడ్ పేరుమీద తాను ఏర్పాటు చేయదలచిన దేశీయ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్‌ఎల్)
ఉత్పత్తి డిస్టలరీ ఏర్పాటు లెసైన్స్‌కోసం 2009 నాటి పాత జీవో ప్రకారం కాకుండా 2011లో జారీ చేసిన జీవో 67 ప్రకారమే లెసైన్స్ ఫీజును చెల్లించాలని
హైకోర్టు తేల్చిచెప్పింది. 2009లో అప్పటి జీవో ప్రకారం ఇప్పటికే చెల్లించిన రూ.17 కోట్లు కాక, 2011 నాటి కొత్త జీవో ప్రకారం మిగిలిన రూ.34 కోట్లను కూడా చెల్లిం చి తీరాల్సిందేనని
స్పష్టంచేసింది.



అంతేకాక రాజకీయ
దురుద్దేశాలతోనే కొడాలి నాని ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్న ఎస్‌పీవై వాదనల్ని
హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ మేరకు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్
దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీ భట్‌తో కూడిన
ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

 

Back to Top