ఫిరాయింపులపై విచారణ చేపట్టాలని హైకోర్టుకు ఆదేశం

న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. పిటిషన్ పై హైకోర్టు వెంటనే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరలో ఈపిటిషన్ను పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.  విచారణ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ న్యాయవాది సోలి సొరాబ్జీ వాదనలు వినిపించారు.

 చంద్రబాబు అవినీతి సొమ్ముతో అనైతికంగా వైయస్సార్సీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేసి రాజ్యంగ విలువలకు తిలోదకాలిచ్చిన నేపథ్యంలో ..వైయస్సార్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని  పిటిషన్‌లో కోరింది. గత వారమే ఈ పిటిషన్ విచారణకు రాగా ఆ సమయంలో వాయిదా వేసిన సుప్రీంకోర్టు తాజాగా శుక్రవారం విచారణ ప్రారంభించి హైకోర్టుకు ఈ సూచనలు చేసింది.

Back to Top