అక్రమ నిర్మాణంలో బాబు నివాసం..హైకోర్టు నోటీసులు

అమరావతిః చంద్రబాబుకు మళ్లీ షాక్ తగిలింది. కృష్ణా నది పరివాహక ఏరియా కరకట్ట ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. సీఎం చంద్రబాబు నివాసం సహా 57మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉన్నపళంగా విజయవాడకు వెళ్లిన సంగతి తెలిసింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఏకంగా దాంట్లో నివాసముండడం వివాదాస్పదంగా మారింది.

Back to Top