బాబు సర్కార్‌కు కోర్టు నోటీసులు జారీ

హైదరాబాద్‌: కేసుల ఉపసంహరణను సవాలు చేస్తూ హైకోర్టులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 120 జీఓలు జారీ చేసి 251 మందిపై కేసులను ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. కేసులు రద్దు అయిన వారిలో స్పీకర్, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అత్యాచారాలు, హత్యాయత్నం లాంటి కేసులను ప్రభుత్వం జీఓలు జారీ చేసి ఎత్తేయడం దారుణమని ఆర్కే పేర్కొన్నారు.

Back to Top