గిడ్డి ఈశ్వరి కి ఊరట

వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కి
హైకోర్టులో ఊరట లభించింది. అదికార తెలుగుదేశం సాగిస్తున్న కక్ష పూరిత
రాజకీయాలకు బ్రేక్ పడింది. ఆమె మీద అన్యాయంగా మోపిన కేసులపై హైకోర్టు స్టే
ఇచ్చింది. 
గిరిజనుల పొట్ట కొట్టేందుకు చంద్రబాబు నాయుడు
ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ
గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా గిరిజనులకు బాసటగా నిలిచేందుకు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చింతపల్లి లో బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో
పాల్గొన్న గిరిజన మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. చంద్రబాబుకి గిరిజనులు
సాంప్రదాయిక పద్దతిలో బుద్ది చెబుతారని హెచ్చరించారు. దీన్ని సాకుగా
చేసుకొని హత్య ప్రయత్నం నేరం కింద ఆమె మీద మూడు పోలీసు స్టేషన్లలో కేసులు
పెట్టించారు. 
దీని మీద గిడ్డి ఈశ్వరి హైకోర్టుని ఆశ్రయించారు.
ఇదంతా రాజకీయ ప్రేరేపిత కుట్రలు అని ఆమె విన్నవించారు. దీని మీద స్పందించిన
హైకోర్టు కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణ ను వాయిదా వేసింది. 
Back to Top