నంద్యాల ఉపఎన్నిక తర్వాత పార్టీలోకి భారీ వలసలు

కడప: కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక తర్వాత వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున వైయస్సార్‌సీపీలోకి వలసలు ఉంటాయని వైయస్సార్‌ జిల్లా పార్టీ అధ‍్యక్షుడు ఆకెపాటి అమరనాథరెడ్డి చెప్పారు. కడపలో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో మైదుకూరు శాసనసభ‍్యుడు రఘురామిరెడ్డి, రాయచోటి శాసనసభ‍్యుడు శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి మాట్లాడారు. నంద్యాల ఉపఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునే దమ‍్మూ ధైర‍్యం ముఖ‍్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. 
 
Back to Top