వాడివేడిగా మండల మీట్‌

చిత్తూరు(బైరెడ్డిపల్లె): స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ విమల అధ్యక్షతన నిర్వహించిన సర్వ సభ్యసమావేశం వాడివేడిగా సాగింది. సమావేశం ప్రారంభం కాగానే ఎంపీడీవో తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అనుమతులు లేకుండా జరుగుతున్న కార్యక్రమాలను నిలదీశారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది.

ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ రుణాల కోసం ఏర్పాటు చేసిన కమిటీని ఎంపీపీ అధ్యక్షతన జరగకుండా అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నుకొన్న కమిటీని రద్దు చేసి సమావేశం కొనసాగించాలని పట్టుపడ్డారు. అలాగే మండలపరిషత్‌ కార్యాలయంలో సిబ్బంది సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చిన సమయాల్లో వస్తుటండంతో సమస్యలపై వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. అధికార పార్టీ నాయకులక ఒత్తాసు పలుకుతూ కార్యాలయంలో రాజకీయాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.   
Back to Top