జాతిపితను అవమానిస్తారా

మ‌హాత్ముడి విగ్ర‌హాన్ని తొల‌గించ‌డం దారుణం
చేసిన తప్పుకు బాబు ప్రభుత్వం క్షమాపణ కోరాలి
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ‌

హైదరాబాద్ః ప్ర‌పంచ దేశాల‌న్నీ జాతిపిత మ‌హాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాన్ని ఆద‌ర్శంగా తీసుకుంటుంటే... చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం ఆయనను ఘోరంగా అవమానిస్తోందని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ మండిపడ్డారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించడం అత్యంత హేయనీయమన్నారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలో ఆమె విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. దేవుళ్లు, మ‌హానుభావుల క‌న్నా నేనే గొప్ప అన్న భావ‌న చంద్రబాబులో క‌న‌బ‌డుతుంద‌న్నారు. మ‌హాత్మాగాంధీకి జ‌రిగిన అన్యాయంపై చంద్ర‌బాబు స‌ర్కారు చెంప‌లు వేసుకోని క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. 

మరిన్ని విష‌యాలు ఆమె మాటల్లోనే...

* ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ బీజేపీని నిలదీయదు.
* ఏపీలో రాజ‌ధాని పేరుతో జ‌రుగుతున్న అన్యాయాలు, అక్ర‌మాల‌పై కేంద్రం నోరు విప్ప‌దు. 
* మీ అక్ర‌మాల‌ను నేను అడ‌గను... నా అక్ర‌మాల‌ను నువ్వు చూపించ‌కు అన్న చందంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరు ఉంది.
* రాష్ట్ర ప్ర‌జ‌లు ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతుంటే...  వైయ‌స్సార్‌సీపీ ఎంపీలు పార్ల‌మెంట్‌లో ఉద్యమిస్తుంటే... టీడీపీ మాత్రం నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హారిస్తుంది. 
* పార్ల‌మెంట్‌లో ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ స‌హక‌రించ‌క‌పోవ‌డం దారుణం
* ఏపీ భార‌త‌దేశంలోని రాష్ట్రామే కాద‌న్న‌ట్లు కేంద్రం వ్య‌వ‌హరిస్తుంది
* చంద్ర‌బాబును మోడీ భుజాలపై మోస్తున్నారు... మోడీని చంద్ర‌బాబు కాపాడుతున్నారు.

మ‌హాత్ముడికి ఇంత‌క‌న్నా అవ‌మానం ఎక్క‌డా జ‌రిగి ఉండ‌దు
* తెల్ల‌వారు జామున విజ‌య‌వాడ న‌డిబొడ్డున మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాన్ని తొల‌గించి కాలువ‌లో ప‌డేయ‌డం దారుణం
*  అభివృద్ధి పేరుతో  దేవాల‌యాలు, వైయ‌స్సార్ విగ్ర‌హం, మ‌హాత్మాగాంధీ విగ్ర‌హం తొల‌గించ‌డం దారుణం
* మ‌హాత్మాగాంధీకి ఇంత అవ‌మానం భార‌త‌దేశంలో ఎక్క‌డ జ‌ర‌గ‌లేదు
* శ‌త్రుదేశ‌మైన పాకిస్తాన్ కూడా ఇలా అవ‌మానించ‌దు. 
* ప్ర‌పంచ దేశాల‌న్నీ జాతిపిత అహింస సిద్ధాంతాన్ని ఆద‌ర్శంగా తీసుకుంటున్నాయి
* ఐక్య‌రాజ్య స‌మితి మ‌హాత్మాగాంధీని పొగుడుతూ స‌త్కార స‌మావేశాన్ని నిర్వ‌హించింది. 
* ఆగ‌ష్టు 8 నాటికి క్విట్ ఇండియా ఉద్య‌మానికి 77 ఏళ్లు పూర్త‌వుతున్నాయి.
* మ‌హాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్య‌మంలో చివ‌రిగా స‌హాయ‌నిరాక‌ర‌ణ పేర క్విట్ ఇండియా ఉద్య‌మాన్ని ప్రారంభించారు. 
* జాతీయానికి సంబంధించిన వాటిని అవ‌మానిస్తే తీసుకెళ్లి జైలులో పెడ‌తారు
* మ‌హాత్మ ఫొటో  రూపాయి నోట్ల‌పై ముద్రించుకుంటున్నాం...అలాంటి మహనీయుని విగ్ర‌హాన్ని తొల‌గించ‌డం ఎంత‌మేర‌కు స‌మంజ‌సం
* దేవుళ్లు, మ‌హానుభావుల క‌న్నా నేనే గొప్ప అన్న భావ‌న చంద్రబాబులో క‌న‌బ‌డుతుంది
* మ‌హాత్మాగాంధీకి జ‌రిగిన అన్యాయంపై అధికార ప్ర‌భుత్వం చెంప‌లు వేసుకొని క్ష‌మాప‌ణ కోరాలి
* మ‌హాత్మాగాంధీకి జ‌రిగిన అవమానం ఏపీకి జరిగింది కాదు... మొత్తం భార‌త‌దేశానికి జ‌రిగింది
* దీనిని నేరంగా భావించి చంద్ర‌బాబు ప్ర‌ాయశ్చిత్తం చేసుకోవాల‌ని వైయ‌స్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది

Back to Top