జీవితంలో కష్టమైనదే సరైన దారి

  • పేదలకు మంచి విద్యనందించే వెంకటప్ప స్కూల్
  • పదో వార్షికోత్సవంలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్న వైయస్ జగన్
  • విద్యార్థులు బాగా చదువుకోవాలని వైయస్ జగన్ ఆకాంక్ష
  • పాఠశాల ఉపాధ్యాయులను అభినందించిన వైయస్ జగన్
వైయస్ఆర్ జిల్లాః పులివెందులలోని పేదవారందరికీ మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ వెంకటప్ప స్కూలును ఏర్పాటుచేసినట్లు వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. వైయస్ఆర్‌ జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పులివెందులలోని వెంకటప్ప స్కూలు పదో వార్షికోత్సవంలో పాల్గొన్నారు. జీవిత ప్రయాణంలో రెండు దారులు కనిపిస్తాయని, వాటిలో ఒకదారి సులభమైనది, మరొకటి కష్టమైనదని చెప్పారు. అయినా కష్టమైనదే కరెక్టయిన దారి అన్నారు. సులభమైన దారి కాపీలు కొట్టడం, సులభంగా పాసయ్యే మార్గాలు, మార్కులు తెచ్చుకునే మార్గాలని.. కానీ ఆదారిలో వెళ్తే తాత్కాలికంగా సాధించగలమేమో గానీ, తర్వాత మాత్రం ఫెయిలవుతామన్నారు. 
 
కష్టమైనది అనిపించే దారిలో కష్టపడి మన జీవితంలో ఈరోజు పడే కష్టాన్ని జీవితంలో రేపు విజయంగా మార్చుకోవచ్చని, అందుకు చదువుతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. చదువు నుంచి జీవితం వరకు ఇలాగే జరుగుతుందన్నారు. జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్నారు. సులభమైన దారిలో పోతే క్యారెక్టర్, క్రెడిబులిటీ రెండూ పోతాయని.. అదే కొంచెం కష్టపడితే ఈ రెండు రావడంతో పాటు దీర్ఘకాలంలో విజయాలు సాధిస్తారని చెప్పారు. 

దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గురువు వెంకటప్ప పేరుతో ఏర్పాటుచేసిన ఈ స్కూల్లో ఎవరి వద్ద నుంచి పైసా ఫీజు కూడా తీసుకోరని, వైయస్ఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తోందని ఆయన చెప్పారు. ఇందుకు పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ అభినందనలు చెబుతున్నామన్నారు. ఈ పాఠశాలలలోని విద్యార్థులందరూ బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైయస్ భారతీరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అందరూ బాగా చదువుకోవాలన్నదే వైయస్ఆర్ ఆశయం
వెంకటప్ప స్కూల్ పదోవార్షికోత్సవం సందర్భంగా వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.  ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులను ఆశీర్వదించారు. వెంకటప్ప స్కూల్  చాలాసార్లు టౌన్ ఫస్ట్ కూడా వచ్చిందని చెప్పారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్ లు అయ్యారని చెప్పినప్పుడు ఎంతో సంతోషమనిపించిందని విజయమ్మ అన్నారు. అందరూ ఇంకా బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా స్టాఫ్ ను అబినందించారు. మన స్కూల్ నంబర్ వన్ గా ఉండాలని భారతమ్మకు వైయస్ఆర్ ఎప్పుడూ చెప్పేవారని విజయమ్మ అన్నారు. టెన్త్ లో స్కూల్ ఫస్ట్ ర్యాంకు వచ్చినప్పుడు వైయస్ఆర్ చాలా ఆనందించారని పేర్కొన్నారు. చదువు అనేది దాచబడిన ధనమని ఎవరూ తీసుకునేది కాదని,  మనం చనిపోతే తప్ప పోదని విజయమ్మ అన్నారు. చదువు విలువ అందరూ తెలుసుకోవాలి. బాగా చదువుకోవాలన్నదే వైయస్ఆర్ ఆశ, ఆశయమని చెప్పారు. భారతమ్మ కూడా స్కూల్ ఉన్నతి కోసం బాగా కష్టపడుతున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ గర్వించేలా వెంకటప్ప స్కూల్ విద్యార్థులు పేరు తెచ్చుకోవాలని విజయమ్మ సూచించారు. 

విద్యాదానం అత్యంత గొప్పది
ఒక్క పూట కడుపు నింపే అన్నదానం కంటే అన్నిపూటలా కడుపు నింపే విద్యాదనం అత్యంత గొప్పదని మన పూర్వీకులు చెప్పేవారని ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తెలిపారు. విద్యను వేలాది మంది విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న మన ప్రియతమ నాయకులు, వైయస్ఆర్  కుటుంబాన్ని మనస్ఫూర్తిగా తలచుకోవాలని అన్నారు. మన నాయకుడు జగనన్నకు విద్య , పిల్లలపై అపారమైన ప్రేమ ఉందన్నారు. మన పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ కేజీ నుంచి పీజీ వరకు రాష్ట్రంలోని ప్రతీ విద్యార్థికి ఇంగ్లీష్ లో  ఉచిత విద్య అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారని చెప్పారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు పిల్లలను బడికి పంపిస్తే ఒక్కో పిల్లాడికి రూ. 500 చొప్పున ప్రోత్సాహకం కూడా ప్రకటించారని చెప్పారు. పిల్లలు, విద్య పట్ల ఆయనకున్న ప్రేమతోనే ఈ పథకాన్ని చేర్చారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు మనం అధికారంలోకి రాలేకపోయినా వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ పిల్లాడికి ఆ భాగ్యం కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. గొప్ప విజయాలు సాధించి పెట్టిన ఉపాధ్యాయులను అభినందించారు. దేశం గర్వించదగ్గ గొప్ప బిడ్డలుగా విద్యార్థులు తీర్చిదిద్దించబడాలన్నారు. Back to Top