ఘనంగా జన్మదిన వేడుకలు

విజ‌య‌వాడః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ప్ర‌కాశం జిల్లాలో ఘ‌నంగా నిర్వ‌హించారు.  సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్ ఆధ్వ‌ర్యంలో కేక్‌క‌ట్ చేసి విజ‌య‌మ్మ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. భ‌గ‌వంతుడు ఆమెను చ‌ల్ల‌గా చూడాల‌న్నారు. 

అదే విధంగా ఒంగోలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో విజ‌య‌మ్మ పుట్టిన రోజు వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు కుప్పం ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో కేక్‌క‌ట్ చేసి సంబ‌రాలు జ‌రుపుకున్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో వైయ‌స్ విజ‌య‌మ్మ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఆనందంగా జ‌రుపుకున్నారు. జిల్లా యువ‌జ‌న, విద్యార్థి, మ‌హిళా విభాగాల ఆధ్వ‌ర్యంలో కేక్ క‌ట్ చేశారు. అనంత‌రం విజ‌య‌మ్మ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, విజ‌య‌కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు. 
Back to Top