హంద్రీనీవా వైయ‌స్ చ‌లువే!

దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రైతుల‌కు చేసిన మేలు ఏ ముఖ్య‌మంత్రి చేయ‌లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం అన్నారు. హంద్రీనీవా వైయ‌స్ చ‌లువే అన్నారు. నాడు హంద్రీనీవా కాలువలు తొవ్వుతుంటే డబ్బులకు తవ్వుతున్నారని విమ‌ర్శించార‌ని, ఇప్పుడు ఆ మ‌హానేత ఎంత మేలు చేశారో తెలుస్తోంద‌న్నారు. చంద్ర‌బాబు వ‌చ్చారంటే క‌రువు వ‌స్తుంద‌ని, అది ఆయ‌న మ‌హిమేన‌న్నారు. ఎక్క‌డైనా రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంద‌ని, కానీ ఏపీలో మాత్రం రాజు బాగున్నాడు కానీ రాజ్యం మాత్రం బాగోలేద‌న్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పంటలు పండక దరిద్రం ఎక్కువవుతోంద‌న్నారు. బాబుది రాక్షస పాలన అన్నారు. రాష్ట్రం కోసం వైయస్‌ జగన్‌ నిరాహార దీక్షలు చేస్తుంటే బాబు గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయ‌న్నారు. వైయస్‌ జగన్‌కు మద్దతుగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Back to Top