హంద్రీ- నీవా వైఎస్ చలవే: రఘువీరారెడ్డి

అనంతపురం: హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలువతోనే పురుడుపోసుకుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి కొనియాడారు. ఇప్పటికే కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  ఉరవకొండలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైఎస్  విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు విమర్శనాలు సంధించారు.
Back to Top