8న `చేనేత‌` ధ‌ర్నా

అనంత‌పురం: చ‌ంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అయినా చేనేత‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ‌ర్మ‌వ‌రం స‌మ‌న్వ‌క‌ర్త కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి విమ‌ర్శించారు. ముడిప‌ట్టు రాయితీ ప‌థ‌కం బకాయిల‌ను వెంట‌నే అందించాల‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన `చేనేత‌` ధ‌ర్నాకు పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ మూడేళ్ల పాలనలో 19నెలల రాయితీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్మికులకు రూ. 17.56కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు.గత  ఏడాది ఆగస్టు 6వతేదీన సీఎం చంద్రబాబు నాయుడు ధర్మవరంలో చేనేత సభను పెట్టి రాయితీ బకాయిలు చెల్లిస్తామని, పరిహారాన్ని వెయ్యికి పెంచుతున్నామని చెప్పి యేడాది గడుస్తున్నా ఇంత వరకు అమలు కాక పోవడం దారుణమన్నారు. కాగా  చేనేత ధ‌ర్నాకు మద్దతు తెలిపాలని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని 1వ వార్డు నుండి 10వ వార్డులలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకు చేనేతల నుండి మంచి స్పందన లభిస్తోంది. 

Back to Top