అందానికి కార్పొరేట్‌ హంగులు

విజయనగరం కంటోన్మెంట్‌: అందానికి కార్పొరేట్‌ హంగులను జోడించేలా జావెద్‌ హబీబ్‌ హెయిర్‌ అండ్‌ బ్యూటీ సెలూన్‌ను విజయనగరంలో ఏర్పాటు చేయడం ముదావహమని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రసాదుల రామకృష్ణలు అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో కళానికేతన్‌ ఎదురుగా హబీబ్‌ హెయిర్‌ అండ్‌ బ్యూటీ సెలూన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్‌ డైరక్టర్‌ ఆర్‌ఎస్‌వీపీ కలగర్ల రాంబాబు మాట్లాడుతూ జావెద్‌ హబీబ్‌ అనేది పెద్ద కార్పొరేట్‌ సంస్థ అనీ దీనిని విజయనగరంలో ఫ్రాంచైజీ ద్వారా ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. జిల్లాలోని యువత, పెద్దలు అంతా దీనిని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జి నాగరాజు, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రసాదుల కనక మహాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, 22వ వార్డు కౌన్సిలరు కరణం విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

Back to Top