గురువారం నాటి యాత్ర 14.5 కి.మీ

నల్గొండ 13 ఫిబ్రవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం నాడు రామడుగులలో ప్రారంభమవుతుంది. భోజన విరామానంతరం తిమ్మాపురం క్రాస్ రోడ్, అనుముల మీదుగా హాలియా చేరుతుంది. అక్కడ ఆమె బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం ఆమె మొత్తం 14.5 కిలోమీటర్లు నడుస్తారని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.

Back to Top