గురువారం నాటి పాదయాత్ర 14.4కి.మీ

రాజమండ్రి, 05 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం 171 వ రోజుకు చేరుతుంది. మొత్తం 14.4 కి.మీ నడుస్తారు. బూరుగుపూడి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర, బూరుగుపూడి జంక్షన్, దోసకాయలపల్లికి చేరుకుంటుంది. అక్కడ శ్రీమతి షర్మిల భోజన విరామం తీసుకుంటారు. తదుపరి నందరాడ, నరేంద్రపురం మీదుగా రాజానగరానికి చేరుకుంటుంది. అక్కడ ఆమె రాత్రి బస చేస్తారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ ఓ ప్రకటనలో తెలిపారు.

Back to Top