గుర్రం నాగబాబు పాదయాత్ర

పాలకొల్లు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాలకొల్లు వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గుర్రం నాగబాబు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నాగబాబు మాట్లాడుతూ..నియోజకవర్గంలో ప్రజలకు తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు పెట్టి కొందామన్నా కూడా నీరు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోవడం లేదన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు సుభీక్షంగా ఉండేవారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో డెల్డా ఆధునీకరణ పనుల కోసం నాడు మహానేత నిధులు కేటాంచారన్నారు. మహానేత మరణాంతం డెల్టా ఆధునీకరణ పనులను పట్టించుకునే నాథుడు లేడన్నారు. 
 
Back to Top