గుర్నాథరెడ్డికి అస్వస్థత...ఆస్పత్రికి తరలింపు

అనంతపురం: అనంతపురం రూరల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో చేస్తున్న జలదీక్షలో పాల్గొనేందుకు బయలుదేరిన గుర్నాథరెడ్డి కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను పరీక్షించారు. అనంతపురం నుంచి వైయస్సార్‌సీపీ శ్రేణులు ఇవాళ ఉదయం బయలుదేరాయి. అదే సమయంలో గుర్నాథరెడ్డి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు.

Back to Top