గురజాలలో నేడు షర్మిల పాదయాత్ర

పులిపాడు (గుంటూరు జిల్లా), 24 ఫిబ్రవరి 2013: మహానేత డాక్టర్ వైయస్ ‌రాజశేఖరరెడ్డి తనయ,‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారంనాడు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో సాగుతుంది. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖరరెడ్డి, ‌కార్యక్రమాల అమలు సమన్వయకర్త తలశిల రఘురామ్‌ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. శ్రీమతి షర్మిల శనివారం రాత్రి బస చేసిన పులిపాడు క్రాస్‌ నుంచి శ్రీమతి షర్మిల 73వ రోజు పాదయాత్రను ఉదయం ప్రారంభించారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

పులిపాడు నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న శ్రీనగర్‌కు శ్రీమతి షర్మిల చేరుకుంటారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన చోట మధ్యాహ్న భోజనానికి ఆగుతారని వారు వివరించారు. అనంతరం ఆమె గామాలపాడు, నారాయణపట్నం, దాచేపల్లి, కేసనాపల్లి మీదుగా రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారని పేర్కొన్నారు.


తాజా వీడియోలు

Back to Top