టీడీపీ, బీజేపీలను ప్రజలు క్షమించరు

గుంటూరుః తెలుగుదేశం పార్టీ తెలుగు ద్రోహుల పార్టీగా మారిందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రజల ఆకాంక్షపై.... టీడీపీ, బీజేపీలు నీళ్లు చల్లడం దుర్మార్గమని ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా సాధన కోసం టీడీపీ కనీస ప్రయత్నాలు చేయకపోవడం దౌర్భాగ్యమన్నారు. హోదా కోసం గుంటూరు జిల్లాలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, రాయితీలు, ఉద్యోగాలు వస్తాయని అన్నారు. 

ప్రత్యేకహోదా వచ్చేవరకు వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు.ప్రభుత్వ వైఖరికి నిరసనగా  రాజకీయలకతీతంగా ఈనెల 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ ల వద్ద వైఎస్సార్సీపీ ధర్నా నిర్వహిస్తుందని చెప్పారు. గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని లేళ్ల పేర్కొన్నారు. పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ హోదా కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తే ఖబడ్దార్ టీడీపీ, బీజేపీలను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. 
Back to Top