రాజ‌న్న బిడ్డ వ‌చ్చాడు



- గుంటూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న‌
- దారిపొడ‌వునా బాధ‌లు చెప్పుకుంటున్నా ప్ర‌జ‌లు
గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు, టీడీపీ పాల‌న‌లో ద‌గా ప‌డ్డ వారికి భ‌రోసా క‌ల్పించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన యాత్ర వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం మీదుగా గుంటూరు జిల్లాకు చేరుకుంది.  గురువారం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 135వ రోజుకు చేందుకుంది. ఉదయం ఉండవల్లి శివారు నుంచి వైయ‌స్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు కొనసాగింది.

బ్ర‌హ్మ‌ర‌థం 
తమ అభిమాన నేత, రాజన్న బిడ్డ వైయ‌స్‌ జగన్‌ రాకతో రాజ‌ధాని ప్రాంతం పులకించింది. గ్రామ గ్రామానా ప్రజలు జననేతకు బ్రహ్మరథం పడుతున్నారు. తమ సమస్యలను వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించి, తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలుకరించి, నవరత్నాలతో అందరికీ మేలు చేస్తానంటూ వైయ‌స్ జగన్‌ భరోసా ఇచ్చారు.  దైన్యం నిండిన గుండెలకు జననేత రాకతో ఆత్మీయ భరోసా లభించింది. టీడీపీ పాలనలో విసిగిపోయిన ప్రజలు అడుగడుగునా జననేతకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. తమ సమస్యలు విన్నవిస్తూ వినతి పత్రాలు సమర్పించారు. వైయ‌స్ఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ నాటి సంక్షేమ పాలన మళ్లీ రావాలని కోరారు. కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం చెబుతూ జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగారు. 

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఏకైక అజెండా అని, మ్యానిఫెస్టోలో చెప్పినవి తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటాలు చేస్తున్న జననేతకు యువత, మహిళలు దన్నుగా నిలిచారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులకు తమ సంఘీభావం తెలిపారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా రాజ‌ధాని రైతుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పిస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top