వైయ‌స్ఆర్‌సీపీ ప్లెక్సీల తొలగింపు

 
 

నెల్లూరు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫ్లెక్సీల ఏర్పాటుపై గూడురు ఎమ్మెల్యే సునీల్‌ ఓవరాక్షన్‌ చేశారు. శనివారం గూడురు నియోజకవర్గంలో వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా స్వాగతం పలుకుతూ పార్టీ నేతలు ఫ్లెక్సీలు  ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఎమ్మెల్యే.. స్థానికులను బెదిరించడంతో వైయ‌స్‌ఆర్‌ సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి గెలవాలంటూ సవాల్‌ విసిరారు.  

Back to Top