నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తాం

  • బండారు సత్యనారాయణకు మతిభ్రమించింది
  • మంత్రి పదవి రాలేదని పిచ్చిగా వాగుతున్నాడు
  • ఓ మంత్రేమో డ్రగ్స్ మాఫియా, ఇంకో మంత్రి ల్యాండ్ మాఫియా
  • మరొకాయన మద్యం మాఫియా..?
  • మేం అధికారంలోకి వచ్చాక అవినీతి పరుల భరతం పడతాం
  • అందరికీ శ్రీ కృష్ణ జన్మస్థలమే
  • వైయస్ జగన్ పై పిచ్చి  ప్రేలాపణలు పేలితే నాలుక కోస్తాం
  • విశాఖ జిల్లా టీడీపీ నేతలను హెచ్చరించిన గుడివాడ
విశాఖపట్నంః 2019 ఎన్నికల్లో అధికారం వచ్చినట్టుగా, మళ్లీ తానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినట్టుగా చంద్రబాబు పగటి కలలు కంటున్నారని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. తమ నాయకుడు వైయస్ జగన్ పై పెందూర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బండారుకు పిచ్చి పిచ్చిపట్టిందన్న ఆలోచన ఈ ప్రాంత ప్రజానీకానికి వస్తోందన్నారు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే డ్రగ్స్ తీసుకుంటున్నారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. రాజకీయ బిక్ష పెట్టిన గురువు ఎన్టీఆర్ మీద చెప్పులు వేసి, ఆయనను వెన్నుపోటు పొడిచిన బండారు...నీతి , జాతి కోసం మాట్లాడే కార్యక్రమాలు చేస్తుంటే పెందూర్తి ప్రజలు తలదించుకుంటున్నారని అన్నారు. మా తండ్రి వినోబాబావే గారి ఉద్యమంలో భూములు పంచాడని బండారు చెప్పడం హాస్యాస్పదమన్నారు. మాకున్న ఆస్తి కేవలం 11ఎకరాలేనని బండారు సోదరులు చెబుతుంటే.... భూములు పంచాం, పేదలకు ఇళ్లు ఇచ్చామని సత్యనారాయణ ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదనే బండారు మతి భ్రమించి మాట్లాడుతున్నారని గుడివాడ విమర్శించారు. 

దేశంలోని డ్రగ్స్, గంజాయి అంతా విశాఖ కేంద్రంగా రవాణా జరుగుతుందని, జిల్లా నాయకులే దీన్ని ప్రోత్సహిస్తున్నారని మంత్రి  గంటా పరోక్షంగా అయ్యన్నపాత్రుడునుద్దేశించి చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడు భూమాఫియా గురించి మాట్లాడుతూ ....విశాఖ భూకుంభకోణంలో  టీడీపీ మంత్రుల హస్తముందని చెప్పింది వాస్తవం కాదా అని గంటాను ప్రశ్నించారు. వాస్తవాలతో కూడిన ఆధారాలను కూడ తాము ప్రజలకు చూపించామన్నారు. ఒక మంత్రేమో డ్రగ్స్ మాఫియా, మరో మంత్రి ల్యాండ్ మాఫియా, ఇంకొకాయన మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్నారని విశాఖ టీడీపీ నేతలపై అమర్నాథ్ నిప్పులు చెరిగారు.  పెందూర్తి  నియోజకవర్గం ముదపాకలో పేదవాడి భూములను కొట్టేసిన చరిత్ర బండారు సత్యనారాయణదని అమర్నాథ్ దుయ్యబట్టారు. జగన్ ను తిడితే మంత్రి పదవి వస్తుందన్న అపోహతో బండారు ఉన్నాడని, మా నాయకుడిమీద  చౌకబారు మాటలు మాట్లాడితే నాలుక కోస్తామని అమర్నాథ్ హెచ్చరించారు.  మంత్రులు , టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి కార్యక్రమాల్ని వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వెలికితీస్తామన్నారు.  అందరికీ శ్రీకృష్ణ జన్మస్థలమేనని చురక అంటించారు. డ్రామా కంపెనీ, రికార్డింగ్ డ్యాన్స్ లంటూ అయ్యన్నపాత్రుడు వైయస్సార్సీపీని విమర్శిస్తున్నారని..మీ మాటలకు పచ్చచొక్కాలు చప్పట్లు కొడుతున్నారేమోగానీ ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని అమర్నాథ్ హెచ్చరించారు. జగన్ మీద ప్రగల్భాలు పలికినవారంతా  తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ ప్రాంత ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అనకాపల్లికి సంబంధించిన నవరత్నాల సభను 9వ తేదీ మధ్యాహ్నం రావుగోపాలరావు కళాక్షేత్రంలో నిర్వహించుకుంటున్నామన్నారు. విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  

తాజా ఫోటోలు

Back to Top