రైల్వే జోన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష

విశాఖపట్నంః విశాఖకు రైల్వే జోన్ సాధించేందుకు..అంబేద్కర్ జయంతి అయిన ఏఫ్రిల్ 14 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన సింహాద్రి అప్పన్న ఆశీస్సులు స్వీకరించేందుకు గుడికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని నెలరోజులుగా చేస్తున్న మహోద్యమానికి  విశాఖలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థిసంఘాలు సంఘీభావం తెలియజేశారన్నారు.  

Back to Top