రైల్వే జోన్ సాధనే ధ్యేయంగా ప్రజా ఉద్యమం

విశాఖ‌ప‌ట్నంః ప్ర‌త్యేక రైల్వే జోన్ సాధ‌నే ధ్యేయంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌రో ప్ర‌జా ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టింది. పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు జిల్లా అధ్య‌క్షులు గుడివాడ అమ‌ర్‌నాధ్ ఈ నెల 30వ తేది నుంచి విశాఖ‌కు ప్ర‌త్యేక‌ రైల్వేజోన్ సాధ‌న కోసం ఆత్మ‌గౌర‌వ యాత్ర‌ను చేప‌ట్ట‌నున్నారు. ఇందులో భాగంగా గురువారం వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో సాయంత్రం 5 గంట‌ల‌కు న‌మూనా శ‌క‌ట‌మ్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మానికి విశాఖ జిల్లా ప్ర‌జ‌లు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. 

Back to Top