ముఖ్యమంత్రి సభలో గ్రూపుల గందరగోళం

ఏలూరు) ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడి పశ్చిమగోదావరి పర్యటనలో గందరగోళం చోటు చేసుకొంది. పోలవరం ముంపు ప్రాంతాల
పర్యటనలో భాగంగా కూకునూరు మండలంలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదిక
మీదకు వెళ్లేందుకు స్థానిక నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు నిలవరించారు.
దీన్ని ఎంపీ మాగంటి బాబు అడ్డుకొన్నారు.

వాస్తవానికి కొంత కాలంగా ఈ
ప్రాంతంలో తెలుగుదేశం నాయకుల మధ్య గ్రూపు తగాదాలు ఉన్నాయి. దీనిమీద పార్టీ హై
కమాండ్ కు ఫిర్యాదులు అందాయి. అయితే స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొంటున్న
కార్యక్రమంలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. దీంతో అలిగిన టీడీపీ ఎంపీ మాగంటి బాబు
చేతిలోని మైక్ ను విసిరేశారు. దీంతో పోలీసులు సర్ది చెప్పి పరిస్థితిని అదపులోకి
తెచ్చారు. 

Back to Top