వైయస్ జగన్ ను కలిసిన వేరుశనగ రైతులు

వైయస్ఆర్ జిల్లా)) ప్రతిపక్ష నేత వైయస్ జగన్ వైయస్ఆర్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వేరుశనగర రైతులు పెండ్లిమర్రిలో జగన్ ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. వేలిముద్రలు వేసుకొని విత్తన కూపన్లు ఇవ్వడం వల్ల నష్టపోతున్నామని జననేత వద్ద మొరపెట్టుకున్నారు. రైతుల ఇబ్బందులపై సానుకూలంగా స్పందించిన వైయస్ జగన్ వేలిముద్రలు లేకుండా కూపన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Back to Top