వైయ‌ర్ఆర్‌సీపీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ

నెల్లూరు: విడవలూరు మండలంలోని రామతీర్ధం పంచాయతీ పరిధిలోని పాతూరులో బుధవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజలను నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆ పార్టీ కన్వినర్‌ బెజవాడ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తీర ప్రాంతాలలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు స్థానికంగా ఉన్న పార్టీ నాయకుడు ఎన్‌ చంద్రయ్య పార్టీ అభిమానంతో  స్థలాన్ని కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. ఈ స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. త్వరలోనే భవన నిర్మాణ పనులను చేపట్టి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బుచ్చంగారి తిరుపతి, కాటంరెడ్డి నవీన్‌కుమార్‌రెడ్డి, పురిణి వెంకటరమణయ్య, గోపాల్‌రెడ్డి, బాస్కర్, ప్రభాకర్, పురిణి వెంకటేశ్వర్లు, వావిళ్ల రమణయ్య, శీనయ్య, తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top