అంబేడ్క‌ర్ విగ్ర‌హ స్థాప‌న‌కు భూమి పూజ‌

పాల‌కొండ‌:  రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హ స్థాప‌న‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి, పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి భూమి పూజ చేశారు. లివిరి గ్రామంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో వారిద్ద‌రు పాల్గొని పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా అంబేడ్క‌ర్ దేశానికి చేసిన సేవ‌ల‌ను వారు కొనియాడారు. అనంత‌రం సింగిడి నిర్వాసితుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.
Back to Top