కూలీల మృతి దురదృష్టకరం

హైదరాబాద్‌: మూసీ వాగులో పడి మహిళా కూలీలు మృతి చెందడం దురదృష్టకరమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ట్రాక్టర్‌ బోల్తాపడి కూలీలు మృతి చెందడం.. విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 
Back to Top